మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...
గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు ..... రామాయణంలో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజింపబడ్డాయి. రామాయణ ములోని శ్లోకములు అనుష్టుప్ ఛందస్సులో రాయ బడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ.11వ శతాబ్దమునకు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
రామాయణం చదవాలనే ఆసక్తి అందరిలోను పెరగాలనే సదుద్దేశ్యంతో ప్రాథమిక విజ్ఞానం కోసం తయారు చేయబడిన
కొన్ని ప్రశ్నలు మాత్రమే ఇవి.. మీకు నచ్చితే మీ బంధుమిత్రులకు కూడా పంపండి...
రామాయణం ఏముంది?:
108 ప్రశ్నలు –జవాబులతో
82. హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
జ.) మైనాకుడు.
83. హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
జ.) సురస.
84. హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
జ.) సింహిక.
85. హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
జ.) నూరు యోజనములు.
86. లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
జ.) లంబ పర్వతం.
87. హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
జ.) అశోక వనం.
88. రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
జ.) రెండు.
89. రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
జ.) త్రిజట.
90. హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
జ.) రామ కథ.
91. రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
జ.) చూడామణి.
92. హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
జ.) ఎనభై వేలమంది.
93. హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
జ.) ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
94. దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
జ.) విభీషణుడు.
95. తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
మధువనం.
96. వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
జ.) మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
97. సీతజాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
జ.) ఆలింగన సౌభాగ్యం.
98. సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
జ.) నీలుడు.
99. ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
జ.) నికుంభిల.
100. రామునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
జ.) అగస్త్యుడు.
101. రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
జ.) ఇంద్రుడు.
102. రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
జ.) మాతలి.
103. రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
జ.) కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
104. గుహునకు, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
జ.) హనుమంతుడు.
105. అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
జ.) శత్రుంజయం.
106. శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
జ.) స్వయంగా తన భవనమునే యిచ్చెను.
107. పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
జ.) బ్రహ్మ.
108. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
జ.) తన మెడలోని ముత్యాలహారం.